భీమ్ గల్ ఠాణను తనిఖీ చేసిన ఏసీపీ
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పోలీస్ ఠాణను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఏసీపీ స్టేషన్ రికార్డులను పరిశీలించారు.స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఏసీపీ ప్రతి రోజు విధిగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎస్సేస్సీ పరీక్షలు ఉన్నందున పటిష్టమైన బందోబస్తును నిర్వహించాలన్నారు.