సమన్వయంతో పని చేస్తూ ఫలితాలు సాధించండి
రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధ్యాపకులు సమన్వయంతో పని చేస్తూ మంచి ఫలితాలను సాధించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న ఆదేశించారు. ఆయన గురువారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు. కళాశాల ప్రిన్సిపల్ బుద్దిరాజ్ అధ్యక్షతన కళాశాల...