నిజామాబాద్ సీటి, బతుకమ్మ:
స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా నిజామాబాద్ నగర మేయర్ ధండు నీతు కిరణ్ తో పాటు అధనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ లు నివాళులు అర్పించారు. శుక్రవారం నగరంలోని వినాయక్ నగర్ లోని కోండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మేయర్ ధండు నీతు కిరణ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన వివక్షలపై పోరాటం చేసిన ఘనత కోండా లక్ష్మణ్ బాపూజీది అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని నమ్మిన సిద్ధాతం కోసం మంత్రి పధవికి రాజీనామా చేసిన నాయకులని అయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు గుజ్జ రాజేశ్వరీ, దత్తాధ్రి, హన్మండ్లు, బిసీ నాయకులు మాడవేడి వినోద్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు