. . . పోక్సో కేసు బాధితురాలి తో పాటు తల్లి, అమ్మమ్మ ను కత్తితో పొడిచి హత్య
. . . తన భార్య ఇద్దరు కొడుకుల ను గొంతు కోసి దారుణ హత్య
. . . హత్య విషయం తండ్రికి చెప్పి తాను చనిపోతున్నానని ఫోన్
వెబ్ డెస్క్, బతుకమ్మ:
ఫోక్సో కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలైన వ్యక్తి అర్ధరాత్రి ఆరుగురిని హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల గూడలో రాజ్ కుమార్ అనే వ్యక్తి కిరాతకంగా ఆరుగురిని కత్తులతో పొడిచి, అందులో కోందరిని గొంతు కోసి దారుణ మారణ హోమానికి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఆరు హత్యలు కలకలం రేపాయి. షాబాద్ మండలం దైవాల గూడా కు చెందిన రాజ్ కుమార్ పై మే 16న తేదీన తన మైనర్ కూతురిని వేధిస్తున్నాడని బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి 26న అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో ఉండి బెయిల్ కోసం సత్ప్రవర్తన ఉన్నట్టు నటించిన కిరాతకుడు విడుదల కాగానే తనలోని రాక్షసత్వం ప్రదర్శించి తన , మన అనే తేడా లేకుండా ఆరుగురిని హత్య చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది…. సంబంధిత కేసులో పోక్సో కేసు పెట్టిన బాధితురాలి ని ఇంట్లో నుంచి లాక్కునేందుకు ప్రయత్నించాడు. అ ప్రయత్నం బాధితురాలి తల్లి, నానమ్మ రుక్కమ్మ లను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మైనర్ బాలికను చెరువు ఊరి చివర తీసుకెళ్లి హత్య చేశారు. అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లి పిల్లలను చూడాలని ఉందని నమ్మించాడు. ఇంటి తలుపులు తీయగానే భార్య సరిత ను కత్తితో పొడిచి హత్య చేశాడు. రెండు సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు కొడుకులు గొంతు కోసి హత్య చేశారు. తరువాత తన తండ్రికి ఫోన్ చేసి తాను ఆరుగురిని హత్య చేశానని తాను చనిపోతున్నానని ఫోన్ చేశాడు. తర్వాత నుంచి రాజ్ కుమార్ ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. రాజ్ కుమార్ ఎక్కడైన ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక పరారీలో ఉన్నార అని పోలీసులు శనివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు పోక్సో కేసు నమోదు నిర్లక్ష్యం వలన రాజ్ కుమార్ సులువుగా బెయిల్ పై బయటకు వచ్చి ఆరుగురిని హత్య చేశారు అని బాధిత బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.