బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం మినార్‌పల్లి గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దారుణ హత్య కేసులో మృతుడి భార్య సాలుబాయి మరియు కుమారుడు వసంత్‌ను బోధన్ రూరల్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జూలై 4, 2025 రాత్రి సమయంలో మినార్ పల్లి గ్రామానికి చెందిన ధరావత్ దేశ్యను అత్యంత క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కేసును సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు, దేశ్యను హత్య చేసినట్లు అతని భార్య మరియు కుమారుడిపై ఆరోపణలు నిర్ధారించి, నిందితులుగా అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు.