పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు

కామారెడ్డి,  బతుకమ్మ : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జిల్లా న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. 2022 సెప్టెంబర్ 18న బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన జల్దేవార్ శ్రీనివాస్ లైంగిక దాడికి యత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బాలిక నానమ్మ వచ్చింది. దీందీ నిందితుడు జరిగిన విషయాన్ని ఎవరైనా...