టీవీల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ప్రయాణికుడి దగ్గర నుంచి ఎల్ ఈడీ టీవీలను ఎత్తుకెళ్లిన కేసులో మహారాష్ర్టలోని కిన్వట్ కు చెందిన శంకర్ నాగూరావును అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 26వ తేదీన ధర్మాబాద్ కు చెందిన మాధవప్ప నిజామాబాద్ లో 32 ఇంచుల రెండు ఎల్ఈడీ టీవీలు కొని స్వస్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చాడు. రాత్రి కావడంతో బుకింగ్ కౌంటర్ వద్ద టీవీలు పక్కన పెట్టుకొని నిద్రించాడు. ఈ క్రమంలో...