కామారెడ్డి, బతుకమ్మ :
ెడ్కామారెడ్డి జిల్లా గాంధారిలో ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.25.45 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ కామారెడ్డి లో సంచలనంగా మారిన ఏటీెఎం దొంగతనం కేసును ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి రాజస్థాన్‌కు చెందిన రషీద్ (30)ను అరెస్టు చేశారు. నల్లరంగు స్కార్పియో, నగదు, మొబైల్ ఫోన్లు, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.