Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 8:09 pm Posted by : ramakrishna

సరైన అవగాహన ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చు

 

. . . ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామ్ మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రైల్వే భద్రతపై సరైన అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను, సమస్యలను అధిగమించవచ్చని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం విద్యార్థులకు నిజామాబాద్ రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఏ.ఎస్.ఐ.ఆర్.సి.డెబ్బర్మ ఆధ్వర్యంలో రైల్వే భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాంగణంలో, ట్రాక్ ప్రాంతంలో, ప్లాట్ ఫారం పైన నిర్లక్ష్యం తగదని అన్నారు. రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం, దిగడం, డోర్ దగ్గర నిలబడి ప్రయాణం చేయరాదని, ఏదైనా అక్రమ రవాణాలు, దొంగతనాలు గమనిస్తే రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రంగరత్నం, రమేశ్ గౌడ్, వినయకుమార్, దండు స్వామి, రామస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.