ప్రమాదవశాత్తు ఇళ్లు దగ్ధం
రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో ఘటన రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఘటనలో రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన బడే లక్ష్మీ, పున్న సావిత్రి ల ఇళ్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతియ్యాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.