విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా

. దేశ చరిత్రలోనే ఓ రికార్డు . ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతోంది . డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, బతుకమ్మ: విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టీఎస్ ఎన్ పీడీసీఎల్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం ప్రజాభవన్ లో రూ.కోటి ప్రమాదబీమా చెక్కును భట్టి విక్రమార్క అందజేశారు....