సీఎం రేవంత్ రెడ్డి ద్రిగ్భాంతి
సహాయక చర్యలకు ఆటంకంగా మారిన నీరు
చిక్కుకున్న 4 రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల కింద ప్రమాదం జరిగింది. మూడు కిలోమీటర్ల మేరకు పైకప్పుకుంగిందని టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించిన పనుల చేస్తున్న క్రమంలో టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ వద్ద 14వ కి.మీ.ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పైభాగం మూడు మీటర్ల మేర కూలిపోయింది. ఈప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడ్డారు. ఈఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర నీరు 4 అడుగులకు చేరింది. సహాయక చర్యలకు నీరు ఆటంకంగా మారింది. సింగరేణి నుంచి రెస్క్యూ టీమ్‌ను అధికారులు రప్పిస్తున్నారు. టన్నెల్‌లో 4 రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.