Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2024, 4:51 pm Posted by : ramakrishna

 మూడు మండలాల నోడల్ ఆఫిసర్ ల భాధ్యతల స్వీకరణ

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

విద్యాశాఖ సంచాలకులు ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖాధికారుల పోస్టులను భర్తి చేస్తు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మండలం పరిధిలోని సినీయర్ గేజిటేడ్ హెడ్మాస్టర్ లను నోడల్ ఆఫిసర్ లుగా నియమించిన విషయం విధితమే . బుదవారం  నిజామాబాద్ సౌత్ మండల విద్యాశాఖ అధికారి గా ఎం.సాయిరెడ్డి, నిజామాబాద్ నార్త్ మండల విద్యాశాఖ అధికారిగా ఆర్.వెంకట్ నారాయణ గౌడ్, మోపాల్ మండల్ విద్యాశాఖ అధికారి గా గేమ్సింగ్ పదవి బాధ్యతలు చేపట్టారు. వారికి  పిఆర్ టియు తెలంగాణ అధ్యక్షులు కృపాల్ సింగ్, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్, శంకర్ భవన్ ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు, ఖిల్లా ప్రధానోపాధ్యాయులు గంగాధర్,  పిఆర్ టియు మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, రవీందర్,ఉపాధ్యాయులు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.