బతుకమ్మ భిక్కనూరు: ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల /కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రఘు సోమవారము ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాను యూనిట్ గా చేసుకుని ప్రవేశాలు ఉంటాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. వీటితోపాటు ఆరవ తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు అన్ని గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి బ్యాక్ లాగ్ సీట్లకు కూడా అప్లై చేసుకోవాలని కోరారు. ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తూనే,విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విద్యార్థుల మెనూలో పోషక పదార్థాలను మెరుగ్గా అందివ్వడానికి డైట్,కాస్మోటిక్ చార్జీలు పెంచింది. ఇటువంటి సదావకాశాన్ని నిరుపేద విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ వెబ్ సైట్ లో http://tgswreis.Telangana.https://tgcet.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.