Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 8:05 pm Posted by : ramakrishna

విద్యాశాఖలో ఏసీబీ కలకలం

  • కార్యాలయంలో వివరాలను సేకరించిన ఏసీబీ అధికారులు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకం వివరాలు సేకరించడం కలకలం రేపుతుంది. ఒకవైపు జిల్లా కలెక్టర్ తో విద్యాశాఖాధికారులు సమీక్ష జరుగుతుండగా ఏసీబీ అధికారులు కార్యాలయంలో వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంకు ఏసీబీ అధికారులు రావడం సర్వసాధారణమైంది. పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 40 పాఠశాలలు ఎంపిక కా వాటికై వచ్చిన నిధులు, ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.