Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 1:55 pm Posted by : ramakrishna

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిజామాబాద్ ఏసీబీ డిఎస్పి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆకస్మిక తనిఖీలతో అధికారులు హడలెత్తించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేయడంతో కార్యాలయంలో స్తబ్ద వాతావరణం నెలకొంది. కార్యాలయంలో పనులు చేయిస్తామని తిరిగే దళారులు కనిపించకుండా పోయారు. ఎక్కడి వారు అక్కడే గప్ చిఫ్ అయ్యారు. ఏసీబీ అధికారులకు ఎవరు చిక్కకపోవడంతో అవినీతి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.