Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 1:08 pm Posted by : ramakrishna

డిప్యూటీ కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు

 

. . . ప్రభుత్వ ఆస్తులను కాజేసిన వైనం వెలుగు లోకి

 రంగారెడ్డి, బతుకమ్మ:

మేడ్చల్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచి వంశీ మోహన్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన ఇండ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఫిర్యాదు మేరకు సోదాలు చేపట్టారు.  ఎసిబి తనిఖీలలో వందల కోట్ల ఆస్తులు గుర్తించి కేసును నమోదు చేశారు. వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లి తో పాటు రంగారెడ్డి జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల్లో రెవెన్యూ శాఖలో ఆర్డిఓ తో పాటు ఇతర హోదాల్లో పనిచేశారు. అబ్ధుల్లాపూర్ మెట్ తో పాటు పిగ్లీ పురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరోపణలు ఉన్నాయి. దానిని రియల్ ఎస్టేట్ సంస్థకు కట్టబెట్టి దాదాపు 10 ప్లాట్లను గిప్ట్ డిడ్ చేసుకున్నట్టు ఎసిబి సోదాలలో గుర్తించినట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహరంలో వంశీ మోహన్ ను విచారిస్తున్నారు..

ACB searches at Deputy Collector's residence