బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు
బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో బుధవారం ఉదయం నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ సోదాల విషయం జిల్లాలో కలకలం రేపింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు వాటిని వదలడానికి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయానికి సమీపంలోని సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ తో పాటు మరొక అధికారి ఉన్నట్లు గుర్తించారు....