ఇన్స్ పెక్టర్ ఆంజనేయులుపై ఏసీబీ కేసు నమోదు
వెబ్ డెస్క్, బతుకమ్మ : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ కేసులో తన కింది అధికారి ద్వారా రూ.5 లక్షలు స్వీకరించారనే కేసులో ఆంజనేయులను అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు,...