వెబ్ డెస్క్, బతుకమ్మ :
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ కేసులో తన కింది అధికారి ద్వారా రూ.5 లక్షలు స్వీకరించారనే కేసులో ఆంజనేయులను అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, రూ.7 లక్షల నగదు, సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, మారుతి విటారా బ్రెజ్జా కారు, గుర్తించినట్లు తెలిపారు. లింగోజిగూడలో 150 చదరపు గజాల చొప్పున రెండు ప్లాట్లు, మనోహరాబాద్ లోని సీఆర్ ఎన్ క్లేవ్ లో 240 చదరపు గజాల పాత ఇళ్ళు, పేరూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ళు, హాలియాలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.2.28 కోట్ల అంచనా వేసినట్లు తెలిసింది.