. . . ఆదాయానికి మించిన ఆస్తుల కుడ పెట్టారని ఆరోపణలపై సోదాలు
. . .నిజామాబాద్ జిల్లాలో నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు
హైదరాబాద్/ నిజామాబాద్, బతుకమ్మ:
రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న జే. మోహన్ నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు పోగేశారని ఆయన నివాసంతో పాటు, బందువుల ఇండ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖాధికారులు హైదరాబాద్ లో నివాసం తో సహ నిజామాబాద్ జిల్లాలో తనిఖీలు చెపట్టింది. ఈఎన్సీ మోహన్ నాయక్ ది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ పూర్ తండా సోంత గ్రామం.

మోహన్ నాయక్ నిజామాబాద్ జిల్లాలో ఆర్ అండ్ బి శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. అవినీతి నిరోధక శాఖాధికారులు …కులాస్ పూర్ తాండ లోని ఈఎన్ సి మోహన్ నాయక్ నివాసం తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బి ఎల్ ఎన్ గార్డెన్ లోని మోహన్ నాయక్ బావమరిది రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ నివాసంలో, మాక్లూర్ మండలం అమ్రాద్ తాండాలో మోహన్ నాయక్ బందువు రెడ్డి నాయక్ నివాసం లో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఓక్క నిజామాబాద్ జిల్లాలో 8 ప్రాంతాల్లో నాలుగు టీంలు ఉదయం నుంచి ఎసిబి జల్లేడ పడుతున్నారు. మోహన్ నాయక్ అధికార దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయలు పోగేశారని ఆరోపణలపై సోదాలు చేపట్టింది. ఎసిబి తనిఖీలలో లెక్కకు మించిన ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం, ప్లాట్ లతో పాటు వ్యవసాయ భూములు భయపడుతున్నట్లు సమాచారం.