Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 4:07 pm Posted by : ramakrishna

జీహెచ్ ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి ఇంటిపై, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని ఎల్ బీనగర్ లో ఉన్న యాదగిరి నివాసంతో పాటు సూర్యపేట్ పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న ఆయన ఇంటిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో యాదగిరికి చెందిన స్థిర, చరస్తుల వివరాలు, భూములు, భవనాలు, బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.