. . . మూడు జిల్లాలో 12 చోట్ల తనిఖీలు
వెబ్ డెస్క్, బతుకమ్మ:
ప్రతిష్టాత్మక నిమ్స్ ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ నివాసం,బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం తెల్లవారగానే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మూడు జిల్లాల్లో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్‌లో కీలక పదవిలో ఉన్న డాక్టర్ లక్ష్మి భాస్కర్ కు చెందిన హైదరాబాద్ లోని ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్ మెంట్ లోని నివాసం, బంధువులు ఇండ్లలో, కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి.. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లు తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎంత మేరకు అస్తులు గుర్తించిన వివరాలను అవినీతి నిరోధక శాఖాధికారులు వెల్లడించలేదు.
