వెబ్ డెస్క్, బతుకమ్మ:
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన పటాన్ చెరువు డీఎస్పీ భీమ్ రెడ్డి ఇండ్లల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ల పరిధిలో వివిధ హోదాల్లో పనిచేసిన భీమ్ రెడ్డి అక్రమ సంపాదన పై ఎసిబికి ఫిర్యాదులు అందాయి. గురువారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ లోని నార్సింగిలో వెసోల్లాస్ మెడోస్ లోగల ఆయన నివాసం తో పాటు రాష్ట్రంలోని 20 చోట్లలో అవినీతి నిరోధక శాఖాధికారులు తనిఖీలు చేపట్టారు. డజన్ కు పైగా ప్రాంతాల్లో జరిగిన భీమ్ రెడ్డి ఇండ్లలో, ఆయన బంధువులు, సన్నిహితులు ఇండ్లలో సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం గుర్తించారు. ప్రస్తుతం భీమ్ రెడ్డి ఉంటున్న విల్లా విలువ బహిరంగ మార్కెట్లో రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు…