Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 5:31 pm Posted by : ramakrishna

ఎంపిడిఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు

 

. . . రూ.40 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంపిడిఓ… ఎంపీఓ

 

. . . వెంచర్ అనుమతి కోసం లంచం ఎంపిడిఓ కొడుకు ద్వారా స్వీకరిస్తుండగా పట్టివేత

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

నూతనంగా ఏర్పాటు చేసే వెంచర్ కు అనుమతులు ఇచ్చేందుకు ఎంపిడిఓ, ఎంపిఓలు రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎంపిడిఓ కొడుకు ద్వారా కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట ఎంపిడిఓ రాధిక, ఎంపీఓ లు రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మండలం పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసే వెంచర్ కు అనుమతులు కోసం ఎంపిడిఓ రాధిక తన కొడుకు ద్వారా డబ్బులు డిమాండ్ చేసింది. బాధితులు ఏసీబీని ఆశ్రయించగా పక్కా ఆధారాలతో ఎంపిడిఓ, ఎంపీఓ తో పాటు ఎంపిడిఓ కొడుకులను పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖాధికారులు. వారిని అరెస్టు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం అని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

. . . మండల కేంద్రంలో సంబరాలు

నర్సింహులు పేట ఎంపిడిఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం అవినీతి అధికారులు పట్టుబడటంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కొందరు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అవినీతి అధికారులు పీడ ఏసీబీ రైడ్ తో విరగడైంది అని సంబరాలు జరిపినట్లు తెలిపారు.