విద్యా శాఖపై ఏసీబీ కన్ను..?
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యా శాఖలో గత డీఈఓ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఏసీబీ నజరేసిందా అంటే.. ఔననే చెప్పాలి.. అందుకు గాను జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గత డీఈఓ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సిబ్బందిని ఆరా తీయడం కలకలం రేపింది. ప్రధానంగా గతేడాది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన గ్లోబల్ ఫౌండేషన్ పై ఎఫ్ఐఆర్ తరువాత జరిగిన పరిణామాలపై వివరాలు అడిగినట్లు సమాచారం. గత డీఈఓ హాయంలో ప్రస్తుతం సర్వ శిక్షా...