- రూ.7వేలు లంచం తీసుకుంటు దొరికిన ఇంచార్జీ రెవెన్యూ ఇన్స్ పెక్టర్
- 13 నెలల వ్యవధిలో కార్పోరేషన్ రెవిన్యూ సెక్షన్ లో రెండో కేసు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ (ఇంచార్జీ రెవిన్యూ అధికారి) సీనియర్ అసిస్టెంట్ కన్న శ్రీనివాస్ రావు మాజీ సైనికోద్యోగికి ఇంటి నెంబర్ కేటాయించాడానికి రూ.7,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. నగరంలోని వినాయక్ నగర్ రిలయన్స్ మార్ట్ రోడ్డులో ఇటీవల మాజీ సైనికోద్యోగి ఒకరు కొత్తగా తన సొంత స్థలంలో జ్యూస్ సెంటర్ ఏర్పాటు చేశారు. తాత్కాలిక నిర్మాణం వద్ద బల్ధియా అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. అయితే కొత్త ఇంటి నెంబర్ ఇవ్వాలంటే తనకు 10 వేలు ఇవ్వాలని ఇంచార్జీ రెవిన్యూ అధికారి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. తాను ప్రభుత్వానికి, బల్ధియాకు అన్ని రకాల పన్నులు చెల్లించనాని డబ్బులు ఎందుకు ఇవ్వలని బాధితుడు ప్రశ్నించడంతో పైళ్ ను పెండింగ్ లో పెట్టారు. దానితో అంతగా డబ్బులు లేవని చెప్పడంతో రూ.7,000 తీసుకునేందుకు అంగీకరించడంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సూచనలతో కార్పోరేషన్ కార్యలయం లో లంచం తీసుకుంటుండగా ఇంచార్జీ ఎసిబి డిఎస్పీ లక్ష్మికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఇంచార్జీ రెవిన్యూ అధికారి శ్రీనివాస్ రావును అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హజరు పరుస్తామని ఎసిబి అధికారులు తెలిపారు.
- 2021లో బోధన్ లో రూ.2 వేలు లంచం తీసుకుని ఎసిబికి చిక్కిన మారలే..
నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యలయంలో లంచం తీసుకుంటు చిక్కిన ఇంచార్జీ ఆర్ఐ కన్న శ్రీనివాస్ రావు జబర్ధస్త్ గా పైస ఇవ్వనిదే పనిచేయడనే ముద్ర పడింది. బోదన్ బల్ధియాలో బిల్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు అస్తిపన్ను తగ్గిస్తానని కిరాణా దుకాణం యాజమాని నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా 2021లో ఎసిబికి చిక్కారు. ఆనాడు లంచం కేసులో ఎసిబి అరెస్టు చేసి జైలు ఊచలను లెక్కించివచ్చిన శ్రీనివాస్ రావు తీరు మారలేదని చెప్పాలి. బోదన్ బల్ధియా నుంచి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సీనియర్ అసిస్టెంట్ గా బదిలీ ఐనాకుడా ఇక్కడ అదే ఒరవడి కొనసాగించాడు. మాజీ సైనికోద్యోగి తాను దేశం కోసం పనిచేశానని లంచం ఇవ్వలేనని చెబితే అది అంతా బార్డర్ వద్ద ఇక్కడ పైసలు ఇస్తేనే పని అని డబ్బులు తీసుకుంటు ఎసిబి చిక్కడం కలకలం రేపింది. మరికొన్ని రోజులలో రెవిన్యూ ఇన్స్ పెక్టర్ గా పదోన్నతి పొందాల్సిన శ్రీనివాస్ రావు ఎసిబికి చిక్కడం కలకలం రేపింది. రెవిన్యూ సెక్షన్ లో ఎసిబి అంటే అంతగా భయపడరని, ఎసిబికి చిక్కిన మళ్లీ పైరవీలు చేసుకుని ఉద్యోగం పొంది అంతకన్న రెట్టింపు సంపాదన అనే ధీమానే శ్రీనివాస్ రావు బరితెగింపు వసూళ్లకు ఉదాహరణ అని చెబుతున్నారు బల్ధియాలో అధికారులు.
- 2024 లో ఇంచార్జీ రెవిన్యూ ఆఫీసర్ పై ఆదాయానికి మించిన అస్థుల కేసు..
నిజామాబాద్ బల్ధియాలో అవినీతి తిమింగలాలకు కొదవ లేదు. గతంలో మున్సిపాల్టిగా ఉన్నప్పుడు ఇంచార్జీ కమిషనర్ గా పనిచేసిన (ఎంఇ) నాజీమ్ అహ్మద్ ఎసిబికి చిక్కిన ఘనత ఉంది. తరువాత బిల్ కలెక్టర్ లు, రెవిన్యూ అధికారులు లంచాల కేసులో దొరికి సస్పెండ్ అయ్యారు. 2014-19 కాలంలో ఎంఇగా పనిచేసిన వేంకటేశ్వర్ రావు లంచం తీసుకుంటుండగా ఎసిబి పట్టుకోగా ఆయన అరెస్టు భయంతో తన నివాస భవనం పైనుంచి దూకి అత్మహత్య చేసుకున్నారు. (ఆనాడు అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్ ద్వారా ఎంఇ చెప్పిన మాటలు వినడం లేదని, చేయని పనులకు బిల్లులపై సంతకాలు చేయడం లేదని కక్ష్యతో ఎసిబికి పట్టించారనే వాదనలు ఉన్నాయి) 2024 ఆగస్టు 9న నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఇంచార్జీ రెవిన్యూ ఆఫీసర్ నరేంధర్ ఇంటిలో ఎసిబి దాడులు నిర్వహించింది. అతని ఇంటిలో రూ.6.7 కోట్ల నగదు దొరికింది. వాటిని ఆదాయానికి మించిన ఆస్థుల కేసుగా నమోదు చేసిన ఎసిబి రెవిన్యూ ఇన్స్ పెక్టర్ నరేంధర్ ను అరెస్టు చేసి జైలుకు పంపింది. కారుణ్య నియమాకం కింద ఉద్యోగ విధులలో చెరిన నరేంధర్ దాదాపు 20 సంవత్సరాలుగా నిజామాబాద్ బల్ధియాలో అడ్డా వేసి అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తాడు. ఆనాడు ఆదాయంకు మించి అక్రమాస్థుల కేసులో మరికొందరు బల్ధియా అధికారుల పేర్లు తెరపైకి వచ్చిన అవి విచారణ పేరుతో అటకెక్కించారని వాదనలు ఉన్నాయి. కాని బల్ధియాలో రెవిన్యూ సెక్షన్ లో రెగ్యూలర్ ఉద్యోగులకన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, బిల్ కలెక్టర్ లు, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ లలో అవినీతి అనకొండలు ఉన్నారని టాక్ ఉంది.