హైదరాబాద్, బతుకమ్మ : కాప్రా ఏఈఈ లక్షా 20వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపాలిటీ ఏఈఈ స్వరూప ఓ కాంట్రాక్టర్ ను రూ.1.50లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం కాంట్రాక్టర్ నుంచి లక్షా 20వేలు లంచంగా తీసుకుంటుంగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈఈ స్వరూపను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.