హైద్రాబాద్, బతుకమ్మ:
హైద్రాబాద్ నగరంలో 2023 లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ పై అవినీతి నిరోదకశాఖ కేసు నమోదు చేసింది. ఎన్నికల కోడ్ ఉండగా, క్యాబినేట్ అమోదం లేకుండా రూ.55 కోట్లు నిధుల విడుధలపై కేసు నమోదు చేశారు.మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రేసిడేంట్ కల్వకుంట్ల తారాక రామారావు ( కేటిఆర్) తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై ప్రివెన్షన్ ఆప్ కరప్షన్ యాక్ట్, క్యాబినెట్ అనుమతులు లేకుండానే నిధుల విడుధలపై 13 (1) ఎ, 13 ( 2) పీసీ యాక్ట్, 409,120 బి సెక్షన్ లక్రింద కేసు నమోదు చేశారు. మాజీ మున్సిపల్,ఐటి మంత్రిగా వ్యవహరించిన కేటిఆర్ పై కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కొరిన విషయం తెలిసిందే. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతించగానే ఎసిబి కేసు నమోదు చేసి వారికి నోటిసులు ఇచ్చి విచారించనుంది 2023 లో హైద్రబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ ( ఫార్ములా రేస్ సీజన్ 9 ) పేరిట కార్ల రేసింగ్ నిర్వహించారు. రేసింగ్, ఇతర ఎర్పాట్లకు హెచ్ఎండిఏ రూ.20 కోట్లు ఖర్చు చేయగా, రేస్ ప్రమోటర్ గా వ్యవహరించిన నేక్ట్స్ జెన్ ఎజేన్సి రూ.150 ఖర్చు చేసింది. ఈ కార్ రేస్ నిర్వహణలో హెచ్ఎండిఏ, నెక్స్ట్ జేన్, ఈ పార్ములా మద్య ఓప్పంధం జరిగింది. ఐతే హెచ్ఎండిఏ, నెక్స్ట్ జేన్ సంస్థలు నష్టాన్ని చవి చూసాయి. అనాడు హెచ్ఎండిఏ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ రూ.55 కోట్ల ను ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కేబినెట్ అమోదం లేకుండా విడుధల చేశారు. దానిపై ప్రభుత్వం అరవింద్ కుమార్ కు రూ.55 కోట్లు తిరిగి చెల్లించాలని నోటిసులు ఇచ్చింది. తాజాగా ఎసబి కేసు నమోదు చేయడంతో కేటిఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు నోటిసులు ఇచ్చి విచారించనుంది. అయితే ప్రతిపక్షాలు ముందు జాగ్రత్తగా కేటిఆర్ పై ఎసిబి కేసు నమోదును అసెంబ్లిలో చర్చించాలని పట్టుబడుతుండటంతో తోలుత అధికారులను విచారించనున్నారు. అసెంబ్లి సమావేశాల తరువాత కేటిఆర్ ను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎసిబి నమోదు చేసిన కేసులో నాలుగు సెక్షన్ లు నాన్ బేయిలేబుల్ కావడంతో గమనర్హం. మాజీ మంత్రి కేటిఆర్ తో పాటు మరొ ఇద్ధరిపై కేసుల నమోదు నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసును విచారించేందుకు ప్రత్యేక టిం ఎర్పాటు చేశారు.