. . . ముగిసిన కాకతీయ విద్యాసంస్థల అకడమిక్ మహోత్సవం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి, తొలి కాకతీయ విద్యాసంస్థలు ప్రెసిడెంట్ మాండవ వెంకట సుబ్బారావు స్మారకంగా కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన అకడమిక్ మహోత్సవం ఈరోజు ఘనంగా ముగిసింది. విద్యార్థుల సర్వతోముఖ వికాసాన్ని లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణాన్ని ఉత్సాహం ఉల్లాసం నింపింది. అకాడమిక్ మహోత్సవంలో భాగంగా స్పెల్లథాన్, టేడ్-కాకతీయ, క్విజ్‌తాన్, మ్యాథ్‌రత్న, అకాడమిక్ గేమ్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డైరెక్టర్లు రజనీకాంత్, రామోజీరావు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చదువుపై ఆసక్తి పెంపొందించడంలో ఇలాంటి అకడమిక్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమైనవి అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామోజీ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అద్భుతమైన ప్రదర్శన చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విజయాన్ని స్పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలలో విజయం సాధించిన విద్యార్థులకు ట్రోఫీలు మరియు వ్యక్తిగత మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల అకాడమిక్, నాన్-అకడమిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
