Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 8:00 pm Posted by : ramakrishna

 కాకతీయ ఒలంపియాడ్ లో అకడమిక్ ఉత్సవాలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

జాతీయ గణిత దినోత్సవం ను కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతదేశ  గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా అకడమిక్ మహోత్సవం పేరిట మ్యాథ్స్ డే ను నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ లు సిహెచ్  రజనీకాంత్, రామోజీరావు, రాజా  తేజస్విని హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Academic celebrations at Kakatiya Olympiadఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ, కాకతీయ విద్యాసంస్థలు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి తెలిపారు. జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే క్రీడల్లో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు అభినందిస్తూ, ప్రతి సంవత్సరం నిర్వహించే క్రీడోత్సవాలు పాటు అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన సిలబస్ ఆధారంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ఐఐటి సిలబస్ ఆధారంగా గణిత ప్రతిభను పరీక్షించేందుకు మ్యాథ్స్ రత్న, భాషా నైపుణ్యాలు వెలికితీయడానికి స్పెలతాన్, విద్యార్థులు తమ ఆలోచనలను క్రమబద్ధంగా వ్యక్తి పరచేందుకు టెక్ కాకతీయ, అన్ని సబ్జెక్టుల్లో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు క్విజతాన్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమైన అన్నారు. నిజామాబాద్ పట్టణంలో తొలిసారిగా ఈ తరహా అకడమిక్ మహోత్సవం నిర్వహించడం గర్వకారణమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సుభాష్ నగర్ క్యాంపస్ బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్న లెక్చరర్లు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా విద్యార్థుల మేధస్సు, నైపుణ్యాలను పెంపొందించేందుకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నోత్తరాల వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థలు వివిధ ప్రిన్సిపాల్, నాన్ అకడమిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు  పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు.

Academic celebrations at Kakatiya Olympiad