Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:27 am Posted by : ramakrishna

 రిమ్స్ చిన్నపిల్లల వార్డులో   ఎసీ బ్లాస్ట్

 

. . . ఊపిరాడక ఇద్దరు పసికందుల మృతి

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ ( రిమ్స్) ఆసుపత్రిలో ఎస్ ఎన్ సియూ వార్డులో ఎసీ బ్లాస్ట్ జరిగింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పసికందులు మృతి చెందారు. ఎలక్ట్రానిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎసి పేలి వార్డులో ఓక్కసారిగా దట్టమైన పోగులు అలుముకున్నాయి. ఈ ఘటనలో  ఉపిరాడక ఐదు రోజుల పసికందు తో పాటు మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగినప్పుడు స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ లో 24 నుంచి 27 మంది చిన్నారులు ఉన్నారు. అప్రమత్తమైన సిబ్బంది మిగిలిన పిల్లలను సురక్షితంగా బయటకు తరలించి రక్షించారు…

 రిమ్స్ ఘటనపై సీఎం తీవ్ర విచారం….

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు దారి తీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు.