Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 3:32 pm Posted by : ramakrishna

ఎబివిపి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం

 

. . . స్కూళ్లను మూసివేసిన పరిషత్ విద్యార్ధులు

 నిజామాబాద్ , బతుకమ్మ:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అవుతుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తున్నారని  ఎబివిపి ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ అన్నారు.. అఖీల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ….. రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నారని, అందుకే రేషనలైజేషన్ పేరుతో 23 వేల పాఠశాలలు మూసేందుకు కంకణం కట్టుకున్నాడని,ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఏజెంట్ లా వ్యవహరిస్తున్నాడని, విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం రెడ్ కార్పేట్ పరిచిందని ఎద్దేవా చేశారు.వెంటనే ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ABVP's district-wide school shutdown successful

 

ప్రైవేటు,కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను అందించే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు పర్యవేక్షణ లేకుండా నడుస్తున్నాయని కావున ఖాళీగా ఉన్న ఎంఈఓ,డీఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక పర్మిషన్ పేరు మీద పలు బ్రాంచ్ లు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆర్థిక దోపిడీకి పాల్పడుతు సరస్వతి నిలయాలు లాంటి పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్న టువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన  డిమాండ్ చేశారు.విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న ఏబీవీపీ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది.కావున విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఈ బంద్ కు సహకరించి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గాదాస్, కూనల్, సoజయ్, వినయ్, రాజకుమార్, రాజేష్, చింటూ, యోగేష్, చరణ్, రాజ్, రితేష్, రవికిరణ్, బమేష్, లికేష్, మున్నా, అభి తదితరులు పాల్గొన్నారు.

ABVP's district-wide school shutdown successful