కాంగ్రెస్ భవన్ లో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కాంగ్రెస్ భవన్ లో భారత మొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నగర మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఎజాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జావిద్ అక్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీకి తోడుగా పాల్గొన్నారని తెలిపారు. ...