Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2024, 5:39 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ భవన్ లో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నగరంలోని కాంగ్రెస్ భవన్ లో భారత మొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నగర మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఎజాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జావిద్ అక్రం హాజరయ్యారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీకి తోడుగా పాల్గొన్నారని తెలిపారు.  స్వాతంత్య్ర అనంతరం దేశానికి మొదటి విద్యా శాఖ మంత్రిగా ఉండి విద్యార్థులకు ఉన్నత విద్య అందే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాడని, ఆయన వివక్షకు వ్యతిరేకుడని అందరూ కలిసి ఉండాలని కోరుకునే వాడు అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కుద్దూస్ కార్పొరేటర్ ,మాజీ డిప్యూటీ మేయర్ ఫహీం ,ఏఎంసీ డైరెక్టర్ మహమ్మద్ ఈస,ఆరిఫ్,అతీక్ ఖాన్, జాఫర్ ,జఫర్ ,ముజాహిద్ ఖాన్ ,రఫిక్, అసాద్ ,అబ్దుల్ వహీద్ ,ఖాసిం తదితరులు పాల్గొన్నారు.