Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 6:01 pm Posted by : ramakrishna

సీపీఎస్ అంతం . . . ఓపీఎస్ సొంతం

. . . కలెక్టరేట్ లో  టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో నిరసన  

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో సీపీఎస్ రద్దు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంగళవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు  టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన వహించగా, టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, అన్ని శాఖల ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడి, డీఆర్డీఏ, ఎస్ఈఆర్పీ, ఐకెపీ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ ప్రసంగిస్తూ 2004 సంవత్సరం తదుపరి చేరిన ఉద్యోగులందరికీ గుదిబండల మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) అంతమై పాత పెన్షన్ విధానం అమలయ్యేంతవరకు  ఈ పోరాటాన్ని ఆపేది లేదన్నారు. పెండింగ్ సమస్యలపై టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  సెప్టెంబర్ 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమానికి  ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని,  సీపీఎస్ అంతం ఓపీఎస్ పంతం, పెండింగ్ సమస్యల పరిష్కారం కావాలని నినాదాలు చేశారు. ఈ సమావేశానికి టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్, సహాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, టిఎన్జీవో ఉపాధ్యక్షులు సంజీవయ్య, అతిక్ అహ్మద్, శివకుమార్, మాణిక్యం, అన్నీ శాఖల ఉద్యోగులు  నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.