మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : తెలంగాణ ప్రభుత్వం శాసన సభ లో ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ ప్రజా ప్రతినిధులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు బుధవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మం భూషణ్ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం...