ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో గండి మాసాని పేట్ ఐదవ వార్డ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ వహీద్ ను మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం నియామక పత్రం అందజేశారు. అనంతరం అబ్దుల్ వహీద్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు ఎమ్మెల్యే మదన్మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు. తన పదవి కాలంలో ప్రజాసేవలో ముందుకు సాగి, ఎల్లారెడ్డి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తానని అన్నారు.