Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 12:48 pm Posted by : ramakrishna

కంటి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు

ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బతుకమ్మ, బోధన్: బోధన్ కంటి ఆస్పత్రిలో శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ   ని ప్రారంభించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ లయన్స్ క్లబ్ ఆస్పత్రి సుమారు 25 ఏళ్ల నుంచి సేవలు అందిస్తుందన్నారు. ఈసేవలను గుర్తించి ప్రభుత్వం తరపున రాజీవ్ ఆరోగ్యశ్రీ మంజూరు చేశామన్నారు. లయన్స్  జనరల్ హాస్పిటల్ కు రాకాసీపెట్ మొయిన్ రోడ్డు లోని బిల్డింగ్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆస్పత్రిలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ ద్వారా కంటి ఆపరేషన్ చే స్తామని  జిల్లా లయన్స్ కోశాధికారి కొడాలి కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్,ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్,ఏసీపీ శ్రీనివాస్, లయన్స్ ఫౌండర్ విశ్వేశ్వర్ రావు, నర్సింహ రెడ్డి, అల్లె రమేష్, నరేందర్ రెడ్డి, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.