Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 1:34 pm Posted by : ramakrishna

ఆప్ పార్టీని చీపురుతో ఊడ్చేశారు : బండి సంజయ్

హైదరాబాద్, బతుకమ్మ : డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిల్లీ ప్రజలు ఆప్ ను ఆపార్టీ గుర్తు చీపురుతో ఊడ్చేశారని వ్యాఖ్యనించారు. కుంభకోణాలు, నిత్యం జైలుకు వెళ్లే పార్టీ నేతలను హస్తిన ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు.  డిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పాలనను కోరుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలో వస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.