Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2024, 11:31 am Posted by : ramakrishna

ముగ్గురు సబ్ ఇంజినీర్లకు ఏఏఈ బాధ్యతలు

నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ శాఖలో ముగ్గురు సబ్ ఇంజినీర్లకు ఏఏఈలుగా బాధ్యతలు అప్పగిస్తూ టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్ వరుణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆర్మూర్ డివిజన్ లోని బాల్కొండ సెక్షన్ లో సబ్ ఇంజినీర్ గా పని చేస్తున్న రమేశ్ ను మోర్తాడ్ కు, పవర్ హౌస్ లో హెచ్ టీ మీటర్ విభాగంలో ఉన్న కిశోర్ ను ఎడపల్లికి ఏఏఈ గా నియమించారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట సెక్షన్ లో ఉన్న సబ్ ఇంజినీర్ ను బీబీపేటకు ఏఈగా పంపించారు. ఇటీవల జరిగిన బదిలీలలో కొందరు విధుల్లో చేరలేదు. ఇంకొందరు విధుల్లో చేరి సెలవులో వెళ్లిపోయారు.  దీంతో రెగ్యులర్ ఏఈలు లేని సెక్షన్ లో సర్దుబాటులో భాగంగా సబ్ ఇంజినీర్లకు  అడ్ హక్ (తాత్కాలిక) పద్ధతిలో ఏఏఈ (అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్)లుగా పోస్టింగ్ ఇచ్చారు.