రైళ్లలో దొంగతనానికి పాల్పడుతున్న యువకుడు అరెస్టు

చోరీ సొత్తు ను స్వాధీనం చేసుకున్న పోలీసులు బతుకమ్మ, నిజామాబాద్ క్రైo : రైల్వే స్టేషన్ లో నిలిచిన రైల్ బోగీలలో ప్రయాణికుల బ్యాగులు , ఆభరణాలు దొంగలిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని ఉప్పల్ కు చెందిన మహమ్మద్ సలీం కృష్ణ ఎక్స్ప్రెస్ లో తన భార్యతో కలిసి అదిలాబాద్ వెళ్తున్నాడు . సోమవారం తెల్లవారుజామున నిజామబాద్ రైల్వేస్టేషన్ లో కృష్ణ ఎక్స్ప్రెస్ ఆగినప్పుడు అతని భార్య కు సంబంధించిన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని...