రూరల్ పోలీస్ స్టేషన్ లో యువకుడి ఆత్మహత్యాయత్నం

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్ కు చెందిన రమేష్ అనే వ్యక్తి ఎస్సై చాంబర్ లోనే ఫ్లెక్సీతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రమేష్ ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసువచ్చినట్లు తెలిసింది. ఎస్సై నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. నిజామాబాద్ నగర...