Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 3:43 pm Posted by : ramakrishna

ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకునికి తీవ్రగాయాలు

బోధన్, బతుకమ్మ : మంధర్నా నుండి అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో బుధవారం బోధన్ మండలం కల్దుర్కి రాంపూర్ గ్రామానికి చెందిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుడిని  బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

A young man was seriously injured in a collision with a sand tractor