ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఎడపల్లి, బతుకమ్మ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా నిజామాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.. ఎడపల్లి ఎస్ఐ.వంశీకృష్ణ రెడ్డి తెలిపి న వివరాల ప్రకారం..జాన్కంపేట్ గ్రామానికి చెంది న మిద్దె సాయినాథ్(31)అనే యువకుడు మూడు నెలల క్రితం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే నెల రోజుల నుండి తన కోడలితో విభేదాలు వచ్చాయాని మృతుడి తల్లి మిద్దె సుజాత తెలిపింది....