జెండా ఆవిష్కరిస్తుండగా కరెంట్ షాక్ తో యువకుడి మృతి

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి వెబ్ న్యూస్, బతుకమ్మ:  శివాజీ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరిస్తుండగా యువకుడి కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఈఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరించే క్రమంలో జెండా పైపు పైన విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్ సంభవించినట్లు తెలుస్తోంది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందగా..ఏడుగురిని సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.