Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 4:12 pm Posted by : ramakrishna

అతిగా మద్యం తాగి యువకుడి మృతి

బాన్సువాడ, బతుకమ్మ  : అతిగా మద్యం తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధనుంజయ్(28) భార్య విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గ్రామంలోని వైన్స్ షాప్ పర్మిట్ రూంలో అధికంగా మద్యం సేవించాడు. అనంతరం బోల్తా పడి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు నస్రుల్లాబాద్ ఎస్సై లావణ్య తెలిపారు.