Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2025, 4:23 pm Posted by : ramakrishna

లారీ ఢీకొని యువకుడు మృతి

లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట మండలం ముస్తాపూర్ తండా వద్ద శుక్రవారం లారీ ఢీకొని యువకుడు మృతి  చెందిన ఘటన చోటుచేసుకుంది. ముస్తాపూర్ గ్రామానికి చెందిన మోహన్ (28) అనే యువకుడు ప్రయాణిస్తున్న బైకును వెనకనుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న మోహన్ అనే యువకుడు మృతి చెందాడు. యువకుని మృతికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమంటూ కామారెడ్డి -ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ  గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. సంఘటన స్థలానికి లింగంపేట్ పోలీసులు చేరుకొని గ్రామస్తులను సముదాయించారు.