Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 September 2024, 11:09 am Posted by : ramakrishna

రైలు కింద పడి యువకుని ఆత్మహత్య

 ఆర్థిక ఇబ్బందులు కారణం

బతుకమ్మ, నవీపేట్ :

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలోని అభంగపట్నం కు చెందిన యువకుడు అల్లే.వినోద్ కుమార్ (28) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు అభంగపట్నం కు చెందిన అల్లే వినోద్ కుమార్ ఈ మధ్యనే గల్ఫ్ నుండి తిరిగివచ్చాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లి నవీపేట్ రైల్వే స్టేషన్ కు సమీపంలో రైల్వే ట్రక్ పై ఆత్మహత్య చేసుకున్నాడని, స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించామని రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు.

A young man committed suicide by falling under a train.