గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన యువకుడు
ఇండియన్ ఎంబసీ ద్వారా స్వదేశానికి ఏజెంట్ల పై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు బతుకమ్మ, మాచారెడ్డి: బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్దామని ఏజెంట్ ఆశ్రయించిన యువకుడికి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ విజిట్ వీసా ఇచ్చి మోసం చేసిన ఏజెంట్ల పై బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే అక్కాపూర్ గ్రామానికి చెందిన గడ్డం మహేష్ జనవరి 2022 సంవత్సరంలో బ్రతుకుతెరువు కొరకు విదేశాలకు వెళదామని తెలిసిన వ్యక్తుల ద్వారా ఏజెంట్ లక్ష్మణ్, దుర్గాప్రసాద్...